అండగా మేమున్నాం.. ఊటూర్ యువత ఆదర్శం

by Ratna Kumari |

మనిషి బతికున్నప్పుడు పలకరించే వారు వేలల్లో ఉంటారు.. కానీ కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన మాల కుల యువకులు నేడు సమాజానికి ఒక కొత్త దిక్సూచిగా నిలుస్తున్నారు.

అండగా మేమున్నాం.. ఊటూర్ యువత ఆదర్శం
X

దిశ, మానకొండూరు : మనిషి బతికున్నప్పుడు పలకరించే వారు వేలల్లో ఉంటారు.. కానీ కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన మాల కుల యువకులు నేడు సమాజానికి ఒక కొత్త దిక్సూచిగా నిలుస్తున్నారు. ఒకరు చనిపోతే కేవలం పరామర్శించి వెళ్ళిపోకుండా.. ఆ కుటుంబానికి ఆర్థికంగా, ధైర్యంగా అండగా నిలుస్తూ 'ఆదర్శం' అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ఒక ఆలోచన.. వందల గుండెలకు ధైర్యం కులంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు వారిని మరింత కుంగదీస్తాయి. ఆ బాధను గమనించిన "ఆదర్శ మాల యూత్ వెల్ఫేర్ అసోసియేషన్" యువత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెంట్ పుట్ట తిరుపతి ఆధ్వర్యంలో 68 మంది యువకులు ఏకతాటిపైకి వచ్చి, మరణించిన వారి కుటుంబానికి పెద్దకర్మ రోజున 50 కిలోల నాణ్యమైన బియ్యం, ఒక మేకను బహుమతిగా అందజేశారు. "మేమున్నాం.. మీకు అండగా" అంటూ వారు చేస్తున్న ఈ సాయం ఆ కుటుంబాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతోంది. యువత చేస్తున్న ఈ త్యాగం వెనుక.. నేటి కాలంలో యువత విలాసాలకు, అనవసర ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తుంటే, ఊటూర్ యువత మాత్రం తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు కేటాయిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ బొల్లం వినయ్, క్యాషియర్ కాల్వ అనిల్ కుమార్, కార్యదర్శి కాల్వ పవన్ కుమార్,ప్రధాన కార్యదర్శి ఎడ్ల అనిల్, ఈసీ మెంబర్లు, బొల్లం అనిల్, బొల్లం సుదర్శన్, మిగిలిన సభ్యులు సమన్వయంతో ఈ అసోసియేషన్‌ను ముందుకు నడిపిస్తున్నారు. "కులం కోసం, గ్రామం కోసం యువత ఏకమవ్వడం గొప్ప విషయం. ఒక నిరుపేద కుటుంబానికి ఆపద కాలంలో ఇంత పెద్ద సాయం చేయడం నిజంగా గర్వకారణం." గ్రామస్తుల ప్రశంస ప్రభుత్వ సహకారం ఉంటే..ప్రస్తుతం తమ స్వయంశక్తితో ముందుకు సాగుతున్న ఈ సంస్థకు ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థల నుంచి కొంత ఆర్థిక తోడ్పాటు అందితే, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story