సొరంగం పైకప్పు కులీ ప్రమాదం.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురికి కార్మికులు.. 

by Dishafeatures2 |
సొరంగం పైకప్పు కులీ ప్రమాదం.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురికి కార్మికులు.. 
X

దిశ , కోనరావుపేట : రాక్ ఫెల్లింగ్ (రాయి) పడిన ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మర్థనపేట గ్రామంలో జరుగుతున్న అండర్ టన్నెల్ ఆడిట్ -2 కింద 12 వ కిలో మీటర్ వద్ద జరిగిన ఘటనలో జార్కండ్‌కి చెందిన ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అందులో యోగేంద్ర కుమార్ (28) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మిగతా ఇద్దరి క్షతగాత్రులను కరీంనగర్ ఫార్చ్యూన్ ఆస్పత్రికి తరలించినట్లు మల్కపేట ప్యాకేజీ 9 కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్యాకేజ్ -9 ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. మృతుడు యోగేంద్ర కుమార్ కుటుంబానికి తక్షణం ఆర్థిక సహాయాన్ని అందించాలని శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. మిగతా ఇద్దరు క్షతగాత్రులకు ఖర్చులకు వెనుకాడకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.


Next Story

Most Viewed