'డబుల్' ఇల్లు కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం

by Web Desk |
డబుల్ ఇల్లు కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా మారింది. ఇదివరకే లబ్ధిదారుల ఎంపిక కోసం ఆరుసార్లు వార్డు సభలు నిర్వహించి తుది జాబితా కోసం డ్రా పద్ధతిలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. సిరిసిల్ల పరిధిలో 2052 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకి గాను అర్హులు మూడు వేల పైచిలుకు ఉండటంతో అధికారులు డ్రా పద్ధతిని ఆశ్రయించారు. అదృష్టం కొద్ది డ్రా పద్ధతిలో ఇల్లు పొందినవారు భావోద్వేగానికి గురవుతుండగా.. ఇల్లు రానివారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చివరిసారిగా వార్డు సభలు ఏర్పాటుచేసి డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు డ్రా తీసే క్రమంలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల స్థానిక కౌన్సిలర్‌ల పట్ల లబ్ధిదారులు నిరసనకు దిగగా, మరికొన్నిచోట్ల అధికారులతో గొడవకు దిగుతున్నారు. తాజాగా.. సిరిసిల్ల పట్టణం శివనగర్‌లో డబుల్ బెడ్ రూమ్ రాలేదని ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని యువకునికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాలుగో వార్డులో తమ కుటుంబానికి డబుల్ బెడ్ రూం రాలేదని ఓ ముస్లిం కుటుంబం వార్డు సభలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed