కొండగట్టును గుడి అని, వేములవాడను గుహాలయమని ఎందుకు అంటారు..?

by Dishanational1 |
కొండగట్టును గుడి అని, వేములవాడను గుహాలయమని ఎందుకు అంటారు..?
X

దిశ, వెబ్ డెస్క్: కొండగట్టును గుడి అని, వేములవాడను గుహాలయమని ఎందుకు అంటారు..?. ఈ డౌట్ చాలామందికి ఉంటది. అయితే, ఈ డౌట్ కు క్లారిటీ ఏంటంటే.. ప్రముఖులు చెప్పినదాని ప్రకారం... ఏదైనా ఒక ప్రాంతంలో ఒక్క దేవుడే కొలువై ఉంటే గుడి అని అంటారు. అదే ఒక ప్రాంతంలో అనేక దేవుళ్లు కొలువై ఉంటే ఆ దేవాలయాన్ని గుహాలయం అని అంటారు. కొండగట్టు ప్రధాన గుడిలో ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే ఉంటారు కాబట్టి గుడి అంటారు. అదే వేములవాడలో రాజన్న, పార్వతీదేవీ, గణేష్ దేవుడు, సుబ్రహ్మణ్యస్వామి, అనంత పద్మనాభస్వామి, శ్రీరాములవారు, అల్లా దేవుడు.. అనేక దేవుళ్లు ఉంటారు కాబట్టి వేములవాడను గుహాలయమని అంటారని చెబుతున్నారు.

Next Story