సిరిసిల్ల ప్రజలకు ఋణపడి ఉంటా: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 1 |
సిరిసిల్ల ప్రజలకు ఋణపడి ఉంటా: మంత్రి కేటీఆర్
X

దిశ, ముస్తాబాద్: సిరిసిల్ల ప్రజలకు తానెప్పుడూ ఋణపడి ఉంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. మండలం పరిధిలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో, బతుకమ్మలతో మంత్రి కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పడు, ఈ క్షణం తాను అనుభవిస్తున్న స్థాయి, గౌరవం కేవలం సిరిసిల్ల ప్రజలు ఆశీర్వదిస్తేనే కలిగాయని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ దేశానికి చేసిందేమి లేదని అన్నారు. నిత్యవసరాలు, వంట గ్యాస్, పెట్రోలు ఇష్టానుసారంగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ని గెలిపించిన కరీంనగర్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారని నమ్ముతున్నానని అన్నారు. సంజయ్ నిత్యం మోదీ భజన చేస్తున్నాడన.. అన్నా.. మోదీ దేవుడన్నా.. అంటూ సంజయ్ ని మంత్రి కేటీఆర్ ఇమిటేట్ చేసి సభలో నవ్వులు పూయించారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని తెలిపారు.

ఆ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను గెలిపించి.. దక్షిణ భారతదేశంలో తొలి హ్యాట్రిక్ సీఎంగా రికార్డులు సృష్టించేలా ప్రజలు తమ ఓటును వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మండల నాయకులు గోపాల్ రావు, ఎంపీపీ శరత్, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, 11 గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed