ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

by Mahesh |
ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారిపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ లు చేశారు. అలాగే పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతి, రెంటచింతల, నర్సారావుపేట లో హింసాత్మక ఘటనలు జరిగాయి. కాగా ఈ ఘటనలపై సీఎస్, డీజీపీలను సీఈసీ వివరణ కోరారుతు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రేపు ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి వెళ్లి ఈసీ ముందు వివరణ ఇవ్వనున్నారు.

Next Story

Most Viewed