స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్

by Sridhar Babu |
స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, నిజామాబాద్ సిటీ : డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ముగిసిన అనంతరం బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ యంత్రాలను సీఎంసీలో భద్రపర్చగా కలెక్టర్ ఒక్కో స్ట్రాంగ్ రూంను సందర్శిస్తూ వాటికి వేసిన సీళ్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూం లు, వాటి పరిసరాలలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను గమనించారు. నిరంతరం నిఘా కోసం అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల పనితీరు, వాటి ద్వారా కొనసాగిస్తున్న పర్యవేక్షణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed