మా ఊరికి బస్సు వేయండి.. రేపాక గ్రామస్తుల మొర

by Disha Web Desk 23 |
మా ఊరికి బస్సు వేయండి.. రేపాక గ్రామస్తుల మొర
X

దిశ,ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ పంచాయతీ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మండలం లో అతిపెద్ద గ్రామమైన రేపాక గ్రామానికి బస్సు లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు మండల కేంద్రానికి రావాలన్న ఆటోల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మా గ్రామానికి ఎప్పటినుండో కరీంనగర్ నుండి బెజ్జంకి మీదుగా మా గ్రామం నుండి ఇల్లంతకుంటకు కరీంనగర్ డిపో వారు బస్సు నడిపేవారు అని కరోనా సమయంలో బస్సును రద్దు చేశారంటే ఇప్పటివరకు మళ్లీ బస్సును పునరుద్ధరించలేదని రేపాక గ్రామ మాజీ ఎంపీటీసీ ఆకుల మధుసూదన్ తో పాటు గ్రామస్తులు పేర్కొన్నారు. రేపాక గ్రామం నుండి కాలేజీ చదువుల కోసం అటు బెజ్జంకి ఇటు మండల కేంద్రమైన ఇల్లంతకుంటకు విద్యార్థులు వెళ్తూ ఉంటారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలేజీ విద్యార్థులు వ్యయప్రయాసలకు ఓర్చి కళాశాలకు వెళుతుంటారని గ్రామస్తులు అంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిందని మా గ్రామ మహిళలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మా గ్రామ మహిళలకు ఆ ఉచిత సౌకర్యం అందుబాటులోకి రావడం లేదని గ్రామస్తులు అంటున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన రేపాక గ్రామానికి రద్దయిన బస్సును మళ్లీ పునరుద్ధరించాలని , గ్రామ ప్రజల ప్రయాణ ఇక్కట్లను రూపుమాపాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండల , గ్రామ ,నాయకులు రేపాక గ్రామానికి బస్సును పునరుద్ధరించేలా ఆర్టీసీ అధికారులను కోరాలని గ్రామస్తులు, మహిళలు ,కోరుతున్నారు. అదేవిధంగా మండలంలోని వెల్జిపురం గ్రామానికి సైతం ఉదయం 6 గంటలకు బస్సు వచ్చిందంటే మళ్ళీ బస్సు లేదని మరొక బస్సును ఈ గ్రామం మీదుగా సిరిసిల్లకు వేయాలని గ్రామం మాజీ సర్పంచ్ ఉడతల వెంకటేశం కోరారు.


Next Story

Most Viewed