థాంక్యూ సార్... రూ. 100 కోట్లు ఇచ్చినందుకు: ఎమ్మెల్యే సుంకే

by Dishanational1 |
థాంక్యూ సార్... రూ. 100 కోట్లు ఇచ్చినందుకు: ఎమ్మెల్యే సుంకే
X

దిశ, మల్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కొరకు మరియు మాస్టర్ ప్లాన్ అమలు చేయుటకు రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేరుస్తూ కొండగట్టు ఆలయానికి రూ. 100 కోట్ల నిధుల జీవోను బుధవారం రోజున విడుదల చేశారని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోవడం సిగ్గు అనిపించడం లేదా, చొప్పదండి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. బండి సంజయ్ దమ్ముంటే నిధులు తీసుకురా.. అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాలను చిన్నచూపు చూశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో కొండగట్టు దశ దిశ మారనుందన్నారు. వేములవాడలో గతంలో వాహనాల పార్కింగ్ కు అనేక ఇబ్బందులు ఉండేవని, ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో వేములవాడలో పార్కింగ్ ఇబ్బందులు తప్పయని, కొండగట్టు కూడా యాదాద్రి తరహాలో అభివృద్ధి చెందనున్నదని ఆయన అన్నారు.


Next Story

Most Viewed