సీఎం ప్రోగ్రామ్‌లో మహిళా ఎంపీపీ సర్పంచ్‌లకు చుక్కెదురు.. ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన

by Disha Web Desk 13 |
సీఎం ప్రోగ్రామ్‌లో మహిళా ఎంపీపీ సర్పంచ్‌లకు చుక్కెదురు.. ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన
X

దిశ, రామడుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు మహిళ రిజర్వేషన్ అంటూ పోరాటం చేస్తుంటే.. ఒక మహిళ ఎంపీపీ నైనా తనను ముఖ్యమంత్రి పర్యటనకు రాకుండా అడ్డుకున్నారని రామడుగు ఎంపీపీ కవిత ఆరోపించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి కేసీఆర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రామడుగు రైతు వేదికలో మీడియా సమావేశం నిర్వహించి రైతులకు అందించే పరిహారం వివరాలను ప్రకటించారు.

మీడియా సమావేశం అనంతరం కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు తనను అడ్డుకున్నారని రామడుగు ఎంపీపీ కవిత ఆరోపించారు. వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మీడియా సమావేశం వద్ద కనీసం ముఖ్యమంత్రిని కలిసి నమస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల బిల్లు కోసం అంటూ పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళ ఎంపీపీని అవమానించడం చాలా బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు మండలానికి చెందిన సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకుని ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉంచారని అన్నారు.

ఇవి కూడా చదవండి : ఆదరించని కన్నకొడుకులు.. చివరికి ఆ వృద్ధురాలు ఒంటికి నిప్పంటించుకొని..

Next Story

Most Viewed