13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్.. ఎందుకంటే..

by Disha Web Desk 23 |
13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్.. ఎందుకంటే..
X

దిశ, మంథని : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఒక గంటకు కుదిస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అటవీ, సమస్యాత్మక ప్రాంతాల నుంచి పోలింగ్ బాక్సులు నియోజకవర్గ కేంద్రాలకు సకాలంలో తరలించేందుకు వీలుగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత నియోజకవర్గాల అధికారులకు సీఈసీ ఆదేశాలిచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని మొత్తం 13 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మంథని, చెన్నూరు, సిర్పూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు,ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ సమయం ఉంటుంది. గతంలో ఇదే పద్ధతిని అమలు చేశారు. మిగతా నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుంది.


Next Story

Most Viewed