అంజన్న స్వాముల ఆకలి తీరుస్తున్న పాషా

by Disha Web Desk 1 |
అంజన్న స్వాముల ఆకలి తీరుస్తున్న పాషా
X

మెట్ పల్లిలో మత సామరస్యాన్ని చాటుతున్న ముస్లిం సోదరుడు

దిశ, మెట్ పల్లి: మతాలు వేరైనా దేవుడొక్కడే అంటూ మత సామరస్యాన్ని చాటుతున్నాడు వెంకట్రావుపేట్ లోని మటన్ కొట్టు పాషా. వివరాల్లోకి వెళితే.. పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు క్షేత్రానికి హనుమాన్ జయంతి సమీపిస్తున్న వేళ ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, జిల్లాల హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు పాదయాత్ర చేసుకుంటూ మల్యాల మండలం మీదుగా కొండగట్టుకు చేరుకుంటారు.

ఈ క్రమంలో మెట్ పల్లికి చెందిన వెంకట్రావుపేట్ సమీపంలో మటన్ కొట్టుతో జీవనం సాగిస్తున్నా పాషా. కొద్ది రోజుల క్రితం కొంతమంది అంజన్న మాలధారణ భక్తులు కాలినడకన వెళ్తూ తన మటన్ షాప్ వద్ద ఆగి నీళ్లు అడిగారని తెలిపాడు. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న పాషా చలించిపోయి వారికి వాటర్ బాటిళ్లు సమకూర్చి వారి దాహార్తిని తీర్చాడు. దీంతో పాషా మదిలో అంజన్న మాలధారణ భక్తులకు తనకు తోచిన సాయం చేయాలనే ఆలోచన అతనిలో మెదలైంది.

అనుకున్నదే తడవుగా మాలధారణ భక్తులు వెళ్లే దారిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన మాలధారణ భక్తులకు రెండు అరటి పండ్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్నాడు. చలివేంద్రం హనుమాన్ జయంతి అప్రతిహతంగా కొనసాగుతోందని ఉదయం పూట ఒక్కరిని.. రాత్రి వేళలో ఇద్దరితో నీళ్లు అరటి పండ్లు పంపిణీ చేస్తున్నట్లు పాషా తెలిపాడు. అంజన్న మాలధారలణ భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాడు.


Next Story

Most Viewed