అక్రమ అరెస్టులు ఇంకెంతకాలం..?

by Dishanational1 |
అక్రమ అరెస్టులు ఇంకెంతకాలం..?
X

దిశ, హుస్నాబాద్: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీన్మార్ మల్లన్నను రెండు రోజుల క్రితం అక్రమంగా అరెస్టు చేసి మీడియా గొంతు నొక్కాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. అరెస్టు చేసి కనీసం అతని కుటుంబ సభ్యులకు కూడా ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా నానా ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. నిరుపేదల పక్షాన నిజాలను నిర్భయంగా మాట్లాడడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దోఘలా అని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్నను వెంటనే విడుదల చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, వైఎస్సార్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



Next Story