1300 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా హబ్

by Disha Web Desk 9 |
1300 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా హబ్
X

దిశ, గంభీరావుపేట: మంత్రి కేటీఆర్ కృషితో మధ్య మానేరు ప్రాజెక్టు వద్ద 1300 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా హబ్ ఏర్పాటు. 367 ఎకరాల విస్తీర్ణంలో 600 యూనిట్లను నెలకొల్పి దాదాపు పదివేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు. సోమవారం రోజున గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సింహ గర్జన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్ష హన్మాండ్లు హాజరై మాట్లాడుతూ.. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్ర భాగాన నిలిపిన మంత్రి కేటీఆర్ మన ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఓ వరం అన్నారు.

ఈ మధ్య అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్‌‌కు పర్శ హన్మాండ్లు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తుందని ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు పూలే ఫారెన్ ఓవర్సీస్ స్కీం తో 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మంజూరు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా హన్మాండ్లు గుర్తుచేస్తూ.. ముదిరాజులు, బీసీలు, ఇతరులు ఇక దుబాయ్ మస్కట్‌లో వెళ్లి నష్టపోవద్దని.. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేయాలని అన్నారు.

ముదిరాజుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో త్వరలో సీఎం మంత్రి కేటీఆర్ గార్లను కలవనున్నట్లు హన్మాండ్లు తెలిపారు. ముదిరాజ్ జనాభా ఈ రాష్ట్రంలో 50 లక్షలని జనాభాకు తగ్గట్టు ముదిరాజులకు వాటా దక్కాల్సిందేనని అన్నారు. రాజకీయ పార్టీల జెండాలు మోస్తూ హక్కుల కొరకు శాసించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామం ముదిరాజ్ సంఘం నాయకులు పర్శ హన్మాండ్లును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరుశురాములు, ఆంజనేయులు, నారాయణ, దేవయ్య, పోచయ్య, ఎల్లయ్య, శ్రీనివాస్, నర్సింలు, మల్లేశం, రాజు, కుల సంఘం పెద్దమనుషులు సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed