మొదట కాంగ్రెస్, ఆపై బీజేడీ ఒడిశాను దోచుకున్నాయి: ప్రధాని మోడీ విమర్శలు

by Dishanational1 |
మొదట కాంగ్రెస్, ఆపై బీజేడీ ఒడిశాను దోచుకున్నాయి: ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు తోడు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌తో పాటు బీజేడీ పైనా విమర్శలు ఎక్కుపెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడు దశాబాలకు పైగా కాంగ్రెస్, ఆ తర్వాత బిజూ జనతాదల్(బీజేడీ) చేసిన దోపిడి కారణంగా వనరులతో కూడిన ఓడిశాను పేదరికంలోనే ఉంచారని ప్రధాని మోడీ తీవ్రంగా విమర్శించారు. సోమవారం రాష్ట్రంలోని బెహ్రాంపూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన మోడీ.. ఒడిశాలో నీరు, సారవంతమైన భూమి, ఖనిజాలు, సుధీర్ఘ తీరప్రాంతం, చరిత్ర, సంస్కృతి ఇలా ఎన్నింటిలో దేవుడు రాష్ట్రానికి ఇచ్చాడు. అయినప్పటికీ ఒడిశా ప్రజలు ఎందుకని పేదరికంలోనే ఉన్నారు? దీనికి సమాధానమే దోపిడి. మొదట కాంగ్రెస్ నేతలు, ఆ తర్వాత బీజేడీ నేతలు దోచుకున్నారు. బీజేడీకి చెందిన చిన్న స్థాయి నాయకులు సైతం పెద్ద పెద్ద బంగాలను కలిగి ఉన్నారని మోడీ అన్నారు. ప్రధానంగా బీజేపీ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన నియోజకవర్గం హింజిలి నుంచి కార్మికులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారు. 'ఇక్కడి చాలా ఆసుపత్రుల్లో డాక్టర్ల పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి, చాలామంది పిల్లలు ఎందుకు బడి మానేస్తున్నారు? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం ఒడిశాకు బడ్జెట్ అందించడంతో తాను ఎప్పుడూ వెనకాడలేదు. గత యూపీఏ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒడిశాకు రూ. లక్ష కోట్లు మాత్రమే ఇచ్చారని, తాను అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి రూ. 3.5 లక్షల కోట్లు ఇచ్చారని మోడీ పేర్కొన్నారు. ఒడిశా ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మోడీ ఆరోపించారు.

Next Story

Most Viewed