- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి పుష్కరాల పనులపై మంత్రి సమీక్ష
గోదావరి పుష్కరాలు-2027 అభివృద్ధి పనుల అదనపు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

దిశ, జగిత్యాల టౌన్ : గోదావరి పుష్కరాలు-2027 అభివృద్ధి పనుల అదనపు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటిలింగాల, ధర్మపురి క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఘాట్ల వద్ద షవర్స్, దుస్తులు మార్చుకునే షెడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మొదటి విడతలో రూ.117 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో కోటిలింగాల క్షేత్రానికి రూ.34.10 కోట్లు, ధర్మపురి క్షేత్రానికి రూ.83.70 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అధికారులు ప్రాధాన్యత క్రమంలో భూసేకరణ, రహదారుల నిర్మాణ ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.






