రూటు మార్చిన మంత్రి కేటీఆర్.. సొంత ఇలాఖాలో కొత్త పంథా

by Disha Web Desk 4 |
రూటు మార్చిన మంత్రి కేటీఆర్.. సొంత ఇలాఖాలో కొత్త పంథా
X

దిశ, రాజన్నసిరిసిల్ల: మంత్రి కేటీఆర్ ఏది చేసినా వార్తాంశమే.. విమర్శలు పట్టించుకోరు..తన పని తాను చేసుకుపోవడం.. నచ్చిన నాయకులను అక్కున చేర్చుకోవడం, నచ్చని నాయకులను దూరం పెట్టడం.. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ కు సర్వసాధారం. ప్రజలకు పని చేసుకుంటూ పోతే..వారే ఆశీర్వాదిస్తారు.. నాకు ఓటు వేయమని మిమ్మలను అడగటం లేదు.. మీకు పని చేసిన వారికి, మీ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన వారికి ఓటు వేసుకోండి.. అది ఏ పార్టీ అయినా కావచ్చు అని చాలా సభల్లో బల్లగుద్ది మరి ఉపన్యాసం ఇస్తారు. చాలా విషయాలో మంత్రి కేటీఆర్ మొండిగా వ్యవహరిస్తారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని ఒక అపవాదు ఉంది. సామాన్య జనం మంత్రి కేటీఆర్ ను కలవడం ఒక గగణమే. ఎప్పుడూ టీఆర్ఎస్ లీడర్లు మంత్రి కేటీఆర్ చుట్టు ఉండి.. సామాన్య జనం సమస్యలు చెప్పుకోవడానికి కూడా పరిస్థితి లేకుండా చేస్తారని సిరిసిల్లలో ఓ చర్చ ఉంది. కానీ మంత్రి కేటీఆర్ లో చాలా మార్పు వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 16,17 తేదీలలో మంత్రి కేటీఆర్ కార్యక్రమాలు తీరిక లేకుండా కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తుంది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. సీఎం తనయుడిగా..షాడో సీఎంగా మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలుగుతుండగా.. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ది విషయంలో కూడా చాలా కృషి చేస్తున్నారు. అభివృద్ది పరుస్తున్నారు. ప్రజల ఆరోగ్య విషయం కానీ, ఇతర ఏ పని అయినా చిన్న మేసేజ్​ తో కేటీఆర్​ వ్యక్తిగత పీఏలు, మంత్రి కార్యాలయ సిబ్బంది, అధికారులు ఆఘామేఘాలపై..ప్రజలకు పనులు చేసి పెడతారు. వ్యక్తిగతంగా కాల్ చేసి మరి పనులు పూర్తయ్యే వరకు ఫాలోఅప్ చేస్తారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలు అంటే అధికారులకు అంత భయం. మంత్రి కేటీఆర్ ను కలవడం కష్టం..కలిశామంటే ఆ పని ఐనట్లే అనే భవన మెజార్టీ ప్రజల్లో ఉంటుంది.

సిరిసిల్ల అభివృద్దికి దగ్గరై.. సామాన్య జనానికి దూరమైన కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అభివృద్ది విషయంలో సక్సెస్ అయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ది విషయంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పోచ్చు. కానీ మంత్రి కేటీఆర్ కు ఉన్న మైనస్.. మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సామాన్య జనంతో.. పార్టీ కార్యకర్తలతో అనుకున్నంత సమయం ఇవ్వకపోవడం, నియోజకవర్గ ప్రజలను కలవకపోవడం పెద్ద మైనన్ గా చెప్పోచ్చని రాజకీయ విశ్లేషకుల చర్చిస్తున్నారు. కానీ మంత్రి కేటీఆర్ తన పంథాను మార్చారు. సిరిసిల్లలో నిర్వహించిన తెలంగాణా జాతీయ సమైఖ్యత కార్యక్రమానికి హజరై సిరిసిల్ల, వేములవాడ కార్యక్రమాల్లో ప్రసగించి.. సిరిసిల్ల కలెక్టరే ట్ కు చేరుకున్నారు. ఉదయం నుంచి రెస్ట్ లేకుండా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కలెక్టరేట్ లో ప్రజా సమస్యలపై.. వ్యక్తిగత వినతి పత్రాల స్వీకరణపై దృష్టి సారించారు. సూమారు 1000 మందికి పైగా మంత్రి కేటీఆర్ ను వచ్చి కలిశారు. పలువురు సెల్పీలే దిగి వెళ్లిపోగా..చాలా మంది తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అన్ని శాఖల అధికారులను పక్కనే ఉంచుకొని..అప్పటికప్పుడు చాలా సమస్యలు పరిష్కరించారు.

కొన్ని హైదరాబాద్ లోని ముఖ్య అధికారులతో మాట్లాడి..సమస్యలు పరిష్కరించాలని కోరారు. వచ్చిన జనంతో మంత్రి కేటీఆర్ ఓపికతో మాట్లాడటం.. వారి చెప్పిన విషయాలు వినడం కనిపించింది. ఎన్నడూ లేనంతంగా ఈ సారి ఏకదాటిగా 6 గంటల పాటు లీడర్లకు సమయం ఇవ్వకుండా ప్రజా సమస్యలకే.. ప్రాధాన్యత ఇవ్వడం రాజన్నసిరిసిల్ల జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రజలకు ఏకకాలంలో ఇంత సమయం ఇవ్వడం ఇది మొదటి రికార్డుగా చెబుతుండగా.. అధికారంలోకి వచ్చాక.. మంత్రి హోదాలో కానీ, ఎమ్మెల్యే హోదాలో కానీ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఒక్కసారి కూడా బస చేయలేదు .జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలకు హజరై.. శుక్రవారం రాత్రి సిరిసిల్ల తన క్యాంపు కార్యాలయంలో రాత్రి నిద్ర తీసి.. రెండవ రికార్డు సృష్టించాడు. ఈ రెండు విషయాలు చర్చిస్తూ...కేటీఆర్ తోనే అన్ని సాధ్యమవుతాయని, సిరిసిల్ల చరిత్రలో ఎప్పుడూ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండేవాడు.. దీనిని తిరగ రాసింది కేటీఆర్ అని చర్చిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి కేటీఆర్ సామాన్య జనానికి అధిక సమయం ఇవ్వడంతో ఇటు సిరిసిల్ల లీడర్లలో.. ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఇలానే నెలకు రెండు లేదా మూడు రోజులు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సమయం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సిరిసిల్ల టీఆర్ఎస్ క్యాడర్ లో.. ఇటు ప్రజల్లో సంతోషాన్ని నింపింది.

Also Read: వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలి.. ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

Next Story

Most Viewed