బైకు పై నుంచి ప‌డి వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

బైకు పై నుంచి ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

బైకు పై నుంచి ప‌డి వ్య‌క్తి మృతి
X

దిశ‌, క‌థ‌లాపూర్ : బైకు పై నుంచి ప‌డి వ్య‌క్తి మృతి చెందిన సంఘట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ర‌వికిర‌ణ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన పోకతోట భూమయ్య(65) అనే రైతు శనివారం సాయంత్రం చింతకుంట గ్రామ సమీపంలోని తన తోటలో పని ముగించుకుని హెచ్ఎఫ్ డీలక్స్ బండి పై వస్తున్న క్రమంలో బండి అదుపుతప్పి క్రింద పడటంతో తీవ్ర గాయల పాల‌య్యాడు. దీంతో వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఆదివారం భూమయ్య మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయంపై అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవికిరణ్ తెలిపారు.

Next Story