'సిరిసిల్ల ‘బడ్జెట్ హోటల్’ అవసరాలకు సౌర విద్యుత్ నే వాడాలి'

by Dishanational1 |
సిరిసిల్ల ‘బడ్జెట్ హోటల్’ అవసరాలకు సౌర విద్యుత్ నే వాడాలి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సౌర విద్యుత్తును మాత్రమే వినియోగించేలా సిరిసిల్ల బడ్జెట్ హోటల్ ను నిర్మించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పెద్దూర్ చివర్లలో రెండో బైపాస్ రహదారికి ఆనుకుని రూ.18 కోట్లతో G+1 విధానంలో నిర్మాణాలు పర్యాటకుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ బడ్జెట్ హోటల్ ను అన్ని హంగులతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఉంటాయని అన్నారు. హోటల్ నిర్మాణం పూర్తయితే దూరప్రాంతం నుండి వచ్చే భక్తులకు, పర్యాటకు సౌకర్యవంతంగా గదులతోపాటు, కాన్ఫరెన్స్ హాలు నిర్మిస్తున్నామని, శుభకార్యాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రంలో బడ్జెట్‌ హోటల్ పర్యాటకులకు తక్కువ ధరలో ఉంచుతుందన్నారు.

మినీ స్టేడియం చాలా బాగుంది

శనివారం సాయంత్రం మినీ స్టేడియాన్ని సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టేడియంలో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాకింగ్ ట్రాక్, వాలీబాల్ షటిల్ కబడ్డీ కోర్టులను పరిశీలించారు.ఇంత చక్కగా నిర్మించిన మినీ స్టేడియంలో ఎట్లా ఉపయోగించుకుంటున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక క్రీడాకారుల కోసం స్టేడియాన్ని తెరవడంతోపాటు జిల్లాలో జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఇక్కడ జరిగేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం గతంలో సన్నద్ధమైన అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించామని అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలిపారు.

వేములవాడ రాజారాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేములవాడ హరిత హోటల్ ను పరిశీలించి పర్యాటకుల కోసం రూములను వాటి నిర్వాణ తీరును పరిశీలించారు.

చక్కని ఆతిథ్యం ఇచ్చేలా హరిత హోటల్ తీర్చిదిద్దాలని అన్నారు. హోటల్ పరిసరాలను, రూములను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంట టూరిజం ఎండి మనోహర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, డీ ఆర్ డీ ఓ గౌతమ్ రెడ్డి, డీపీఓ రవీందర్, జిల్లా క్రీడల అధికారి ఉపేందర్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, స్థానిక తహశీల్దార్ విజయకుమార్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed