ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం!

by Dishanational2 |
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం!
X

దిశ, గోదావరి ఖని: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.70ల క్షల వ్యయంతో చేపట్టిన ప్రహారి నిర్మాణం, రూ.20లక్షలతో నిర్మించతలపెట్టిన బ్లడ్ బ్యాంక్ అదనపు గదులు, భూగర్భ డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపించిందని, ఎప్పటిక ప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా అధికారులు పట్టించుకో వడం లేదని, కాంట్రాక్టర్లతో ప్రిన్సిపాల్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాల్సి ఉండగా జనరల్ ఆసుపత్రిలో ప్రతి పనిలో తలదూర్చుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విధులు నిర్వహించాల్సి ఉండగా ప్రిన్సిపాలే సూప రింటెండెంట్‌గా వ్యవహరించడం సరైంది కాదని, జనరల్ ఆసుపత్రిలో ఖర్చు చేయా ల్సిన నిధుల్లో కూడా ప్రిన్సిపాలే జోక్యం చేసుకుంటుందని, ప్రస్తుతం ఉన్న సూపరిం టెండెంట్‌ను మార్చి మరొకరిని నియమించాలని, దీనిపై జిల్లా కలెక్టర్‌కు వినతి ప త్రం కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు.

Next Story

Most Viewed