నూత‌న ఆల‌యం ప్రారంభోత్స‌వానికి మంత్రికి ఆహ్వానం

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల గ్రామస్తులు సర్పంచ్ శరవిందు ఆధ్వర్యంలో చిగురు మామిడి మండల కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

నూత‌న ఆల‌యం ప్రారంభోత్స‌వానికి మంత్రికి ఆహ్వానం
X

దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల గ్రామస్తులు సర్పంచ్ శరవిందు ఆధ్వర్యంలో చిగురు మామిడి మండల కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. దుమాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకొని ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మే 9న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ని రావాల‌ని గ్రామస్తులు ఆహ్వానించారు. అంతకుముందు వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని ఆహ్వానించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల‌ని గ్రామస్తుల పక్షాన నాయకులు వెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చేపట్టాల్సిన‌ అభివృద్ధి పనులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, ఉప సర్పంచ్ విశాల్, ఆలయ కమిటీ చైర్మన్ బాలయ్య, మాజీ సర్పంచులు కదిరె శ్రీనివాస్ గౌడ్, నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీలు శంకర్, బాల కిషన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు షేక్ గౌస్, మెండె శ్రీనివాస్, దుమాల గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story