కోరుట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు: 'దిశ' కథనానికి స్పందన

by Disha Web Desk 1 |
కోరుట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు: దిశ కథనానికి స్పందన
X

దిశ, కోరుట్ల టౌన్: పట్టణంలో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు మంగళవారం పలు దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఆదివారం దిశ పత్రికలో ప్రచురితమైన 'జాడ లేని ఫుడ్ సెఫ్టీ అధికారులు' అనే కథనానికి అధికారులు స్పందించారు.మంగళవారం పట్టణంలో సంబందిత శాఖ అధికారులు కిరాణ దుకాణాలతో పాటు హోటళ్లలో తనిఖీలు చేపట్టి, కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు.

సేకరించిన శాంపిల్స్ లో ఏమైనా కల్తీ జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఆ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే రాబోవు రోజుల్లో కూడా ఆహార పదార్థాలు కల్తీ జరగకుండా నిత్యం దాడులు నిర్వహిస్తామని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణంలోని వ్యాపారస్థులు అందరూ ఆహార పదార్థాలు ముఖ్యంగా వంట నూనె ఇతర పదార్థాలు కల్తీ చేయకుండా ఉండాలన్నారు.

అదేవిధంగా ఫ్రిజ్ లో నిలువ చేసిన ఆహార పదార్థాలను వాడకుండా ఉండాలని ఆహార కల్తీ నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో జగిత్యాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్.అనూష, సిరిసిల్ల ఫుడ్ ఆఫీసర్ ఎం.అనూష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed