తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే తాటతీస్తాం : మాజీ ఎమ్మెల్యే సుంకె ర‌విశంక‌ర్

by Ratna Kumari |

తెలంగాణ సమాజం, ఇక్కడి ప్రజల అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, అలాంటి ప్రయత్నాలు చేస్తే తాటతీస్తామని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా హెచ్చరించారు.

తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే తాటతీస్తాం  : మాజీ ఎమ్మెల్యే సుంకె ర‌విశంక‌ర్
X

దిశ, గంగాధర : తెలంగాణ సమాజం, ఇక్కడి ప్రజల అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, అలాంటి ప్రయత్నాలు చేస్తే తాటతీస్తామని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే.. కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణపై ఉన్నది ప్రేమ కాదు, కేవలం డ్రామా అని దుయ్యబట్టారు. "ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినకుండా నిరసన తెలిపిన నువ్వు.. ఇప్పుడు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉన్నట్టు నటిస్తావా? నీ నటనలు, డ్రామాలు కేవలం సినిమాలకే పరిమితం.

అవి నీ ఆంధ్ర ప్రాంత ప్రజలకే వినసొంపుగా ఉంటాయి.. ఇక్కడ మాట్లాడితే కంపుగా ఉంటాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అభ్యర్థులు నిలబడలేదా? మీరు గెలిచిన సీట్లు ఎన్ని? అని పవన్‌ను ప్రశ్నించారు."తెలంగాణ మీ అయ్యా జాగిరా?" అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్రతిఘటించారు. బరాబర్ తెలంగాణ మా జాగిరేనని, ఎందరో అమరుల త్యాగాలు, పోరాటాల వల్ల సిద్ధించిన తెలంగాణ గడ్డపై ఇక్కడి ప్రజలకే పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో మళ్లీ ఎన్ని కుట్రపూరిత డ్రామాలు ఆడినా సాగవన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టుకొస్తున్న ఇలాంటి విషపవనాలకు యావత్ తెలంగాణ సమాజం తగిన సమయంలో ఖచ్చితంగా బుద్ధి చెబుతుందని సుంకె రవిశంకర్ హెచ్చరించారు.

Next Story