సీఎం కేసీఆర్ కు మనసుంటే.. మార్గం నేను చూపిస్తా : ఎంపీ ధర్మపురి అరవింద్

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ కు మనసుంటే.. మార్గం నేను చూపిస్తా : ఎంపీ ధర్మపురి అరవింద్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి రైతుల సమస్యలు తీర్చాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు తడిసిన ధాన్యం కొనాలని చిత్తశుద్ధి లేదన్నారు.

రైతులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ కు నిజంగా మనసు ఉంటే అందుకు మార్గం నేను చూపిస్తానని ధర్మపురి అరవింద్ అన్నారు. తడిసిన ధాన్యం సగం ధరకు అమ్ముకుంటున్నామని రైతులు తెలుపగా అరవింద్ ఈ విధంగా మాట్లాడారు. పక్క రాష్ట్రంలో ఇథనాల్ ప్రాజెక్ట్ కు రా మెటీరియల్ తక్కువగా ఉందని మన రాష్ట్రంలో ఉన్న రంగు పోయినా మొలకలు వచ్చిన వడ్లను ఆయా కంపెనీలతో మాట్లాడే సోయి సీఎంకు లేదన్నారు.

ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు ఆర్థిక ఇబ్బందులు రావని జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలే భరిస్తాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంఘ చైర్మన్ పన్నాల తిరుపతిరెడ్డి స్థానిక సర్పంచ్ చెరకు జాన్, రైతులు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: కేసీఆర్, కేటీఆర్ మత్తు వదిలి రైతుల గురించి పట్టించుకోవాలి.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్



Next Story

Most Viewed