గతుకుల రోడ్డుకు అతుకులు పడేనా..!

by Disha Web Desk 23 |
గతుకుల రోడ్డుకు అతుకులు పడేనా..!
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం నుంచి పలు గ్రామాలను కలిపే రోడ్లు భారీ గుంతలతో ప్రమాదకరంగా మారాయి. దూలూరు, బొమ్మేన, తక్కళ్లపెళ్లి గ్రామాలని కలిపే రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా మారింది. దీంతో గతుకులు పడ్డ రోడ్డు ప్రమాదాలకు నెలవు గా మారుతున్నాయి. రైతులతో పాటు చిరు వ్యాపారులు దగ్గర లో ఉన్న కోరుట్ల కు వెళ్లాలంటే ఇదే రోడ్డు తప్ప మరో మార్గం లేదు. అడుగడుగునా పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడటంతో ఆ రోడ్ల గుండా వెళ్లే వారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. రాత్రిపూట ప్రయాణం చేసేవారు గుంతల కారణంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కొత్త రోడ్డు వేయకపోయినా కనీసం గతుకులు పడ్డ రోడ్లను తాత్కాలికంగా మరమ్మత్తులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అంచనాలకే పరిమితమైన రోడ్డు నిర్మాణం..

గతంలో ఆర్ అండ్ బి అధికారులు లింక్ రోడ్డు నిర్మాణం కొరకు సర్వే చేసినట్లు తెలుస్తుంది. సర్వే లో భాగంగా దూలూరు, బొమ్మేన,తక్కలపెల్లి గ్రామాల లింక్ రోడ్డు నిర్మాణానికి 2.56 లక్షలు అదే విధంగా బొమ్మేన నుండి గంభీర్ పూర్ గ్రామాల మధ్య గల రోడ్డు నిర్మాణం కోసం 70 లక్షల అంచనా వేసినట్లు సమాచారం. నివేదికను అప్పటి ప్రభుత్వానికి పంపినప్పటికీ రోడ్డు నిర్మాణానికి మాత్రం మోక్షం దక్కలేదు. దీంతో గ్రామాల మధ్య ఉన్న లింక్ రోడ్డు విషయం అంచనాలకే పరిమితం అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్థానిక నాయకులు రోడ్డు నిర్మాణానికి చొరవ చూపాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కనీసం గుంతలు అయినా పూడ్చండి : కొర్రు నర్సయ్య రైతు.

పెద్ద పెద్ద గుంతలతో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు నిర్మాణం చేస్తే రైతులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. లింక్ రోడ్డు నిర్మాణం చేసే పరిస్థితి లేకపోతే కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలైన పూడ్చండి.


Next Story

Most Viewed