ఏసీబీకి చిక్కిన వీఆర్వోకు నాలుగేళ్ల జైలు

by Disha Web Desk 1 |
ఏసీబీకి చిక్కిన వీఆర్వోకు నాలుగేళ్ల జైలు
X

దిశ, కరీంనగర్ లీగల్: తిమ్మాపూర్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన వీఆర్వోకు బుధవారం కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నాలుగేళ్ల జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ వారి కథనం మేరకు.. 2013లో తిమ్మాపూర్ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణ అదే గ్రామానికి చెందిన పెండ్యాల మహిపాల్ రెడ్డి కి చేందిన వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసే విషయంలో లంచం డిమాండ్ చేశాడు.

దీంతో మహిపాల్ రెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు రూ.5 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను విచారించిన అనంతరం నిందితుడు వెంకటరమణకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. వెంకటరమణ ప్రస్తుతం పెద్దపెల్లి డీపీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.



Next Story

Most Viewed