దేశానికి ఆదర్శంగా జిల్లెల వ్యవసాయ కళాశాల: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 1 |
దేశానికి ఆదర్శంగా జిల్లెల వ్యవసాయ కళాశాల: మంత్రి కేటీఆర్
X

కళాశాలకు బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలి ​

దిశ, కరీంనగర్​ బ్యూరో/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లెల గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, రానున్న రోజుల్లో జిల్లెల కళాశాల దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని శాసనసభ స్పీకర్ పొచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో నిర్మించిన వ్యవసాయ కళాశాలను బుధవారం శాసనసభ స్పీకర్ పొచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన స్పీకర్ పొచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా జిల్లెల కళాశాల నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను 47 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే గొప్పగా కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి చేశారని స్పీకర్ అన్నారు.

ఒక్కప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల కేసీఆర్​రాష్ర్టంలో కట్టిన ప్రాజెక్ట్ లతో ఊబికి వచ్చిన భూగర్భ జలాలతో రాష్ర్టంలోనే నెంబర్ వన్​గా నిలిచిందన్నారు.మంత్రి కేటీఆర్ ప్రత్యేక చోరవతో 10 లక్షల మందికి ఐటీ లో ఉపాధి లభించిందని అన్నారు. రాష్ర్టంలో 22 వేల పరిశ్రమలు కొత్తగా వచ్చాయని 19 లక్షల మందికి నాన్ ఐటీ రంగంలో ఉపాధి లభించిందని పోచారం అన్నారు.

నాడు పోరాటాల్లో.. నేడు అభివృద్ధిలో నెంబర్ వన్: మంత్రి నిరంజన్​రెడ్డి

ఆధునిక వసతులతో సాంకేతికత పద్దతులతో కూడిన కళాశాల సిరిసిల్లకు రావడం విద్యార్ధుల అదృష్టమని అన్నారు. తాను చదుకునే రోజుల్లో పోరాటాలకు సిరిసిల్ల నిలయమని, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ గా నిలిచిందన్నారు. సమైక్య రాష్ట్రంలో సరిపడా భూములు ఉన్న ధాన్యం కోసం వెంపర్లాడే పరిస్థితి ఆనాటిదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారని అన్నారు. స్వరాష్ట్రంలో చిధ్రమైన జీవితాలకు సిరిసిల్ల నెలవుగా ఉండేదని ఇప్పుడు బంగారు భవిష్యత్తుకు నెలవుగా మారింన్నారు.

కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి కేటీఆర్

తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకుంటే దేశానికే గర్వ కారణంగా నిలిచే అగ్రానమిస్ట్ లు తయారవుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లెల కళాశాలకు జగ్జీవన్ రామ్​పేరు పెట్టడంతో పాటు కళాశాల ఆవరణలో జగ్ఞీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పుల వచ్చాయన్నారు. హెలికాప్టర్లో వచ్చేటప్పుడు వరుసగా కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, శ్రీరాజరాజేశ్వర జలశయాలు కనపడ్డాయని అన్నారు. విద్యార్ధులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఎంటర్ ప్రైనర్​గా మారాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

అమెరికా స్థాయిలో వ్యవసాయాధివృద్ది: వినోద్​ కుమార్

సీఎం కేసీఆర్ 20ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకొకపోతే జిల్లెల గ్రామంలో వ్యవసాయ కళాశాల ఉండేదా అన్ని అన్నారు. తెలంగాణలో అమెరికా స్థాయిలో వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.



Next Story

Most Viewed