మిల్లులకే నేరుగా పత్తి రైతుల అమ్మకాలు..

by Gugulothu.Kavitha |

దళారుల ఆగడాలు తట్టుకోలేక పత్తి రైతులు నేరుగా మిల్లులను ఆశ్రయించి అమ్మకాలు చేస్తున్నారు.

మిల్లులకే నేరుగా పత్తి రైతుల అమ్మకాలు..
X

దిశ, జమ్మికుంట టౌన్: దళారుల ఆగడాలు తట్టుకోలేక పత్తి రైతులు నేరుగా మిల్లులను ఆశ్రయించి అమ్మకాలు చేస్తున్నారు. పత్తి మిల్లు గేటు కూడా తీయక ముందే పత్తి రైతులు వెహికలతో మిల్లు ముందు బారులు తీరుతున్నారు. ఇదే అదునుగా చూసుకొని మిల్లు యాజమాన్యం మార్కెట్లో కంటే మిల్లులోనే మంచి ధర వేస్తున్నామని వారి మాయమాటలతో రైతులను మోసం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు, మార్కెట్ కమిటీ పట్టించుకోకపోవడం వల్లనే రైతులు నేరుగా మిల్లులను ఆశ్రయిస్తున్నారని రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికైనా మార్కెట్ అధికారులు మార్కెట్ కమిటీ స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Next Story