సింగరేణికి పూర్తి స్థాయి సారథి.. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ధ ప్రకాశ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-12 11:45:03  IST  )

కొంతకాలంగా ఇంచార్జ్ సీఎండీలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సంస్థ కార్యకలాపాలు నడుస్తున్న విషయం తెలిసిందే.

సింగరేణికి పూర్తి స్థాయి సారథి.. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ధ ప్రకాశ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతకాలంగా ఇంచార్జ్ సీఎండీలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సంస్థ కార్యకలాపాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ అదనపు బాధ్యతల్లో ఉన్న డి.కృష్ణ భాస్కర్ (D Krishna Bhaskar) స్థానంలో జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను పూర్తి స్థాయి సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (K Rama Krishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్ (Jyoti Buddha Prakash) సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన బుద్ధ ప్రకాశ్ గతంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా, రవాణా శాఖ కమిషనర్‌గా, వివిధ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం ఉంది. వైద్య విద్యను అభ్యసించిన ఆయన పరిపాలనా రంగంలో తనదైన ముద్ర వేశారు.

Next Story