జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోరుబాట..!

by Disha Web Desk 12 |
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోరుబాట..!
X

దిశ ప్రతినిధి నిర్మల్: మూడేళ్లు సర్వీస్ పూర్తిచేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం పై జేపీఎస్ లు మండిపడుతున్నారు. అదనంగా మరో ఏడాది కాలం ఈ నెల 11 నాటికి మొత్తంగా నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన తమను రెగ్యులర్ చేయకపోవడంపై జిపిఎస్ లు ఆందోళన బాట పడుతున్నారు ఇందులో భాగంగానే ఈనెల 17న హైదరాబాదులో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9వేలకు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు ప్రభుత్వం స్పందించక పోతే ఈనెల 28 నుంచి సమ్మెకు దిగుతామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. ఈ మేరకు అన్ని మండలాల్లో శనివారం ఎంపీడీవోలను కలిసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె నోటీసులను అందజేశారు.

వాస్తవానికి జెపిఎస్‌ల నియామకం సమయంలో మూడు సంవత్సరాలు ఇలాంటి అవకతవగలకు పాల్పడకుండా... తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు ఎండిపోకుండా.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడే వారిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వారికి ఇచ్చిన నియామక పత్రాల్లోనూ మూడేళ్ల కాంట్రాక్టు కాలపరిమితి తర్వాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అదనంగా దీన్ని మరో ఏడాది ప్రభుత్వం పొడిగించింది. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా తమను రెగ్యులర్ చేయకపోవడంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని జూనియర్ కార్యదర్శులు చెబుతున్నారు. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీఎన్జీవో మద్దతు ఇచ్చేనా..?

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిర్వహిస్తూ వారు ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. జేపీఎస్‌లు ఉద్యోగాల్లో చేరినప్పటి నుంచి ఉద్యోగ సంఘాల విషయంలో జిపిఎస్ ఉద్యోగుల సంఘంతో పాటు టీఎన్జీవోల సంఘాన్ని బలంగా నమ్ముకుంటూ వస్తున్నారు అయితే తాజాగా జేపీఎస్ లు సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో టీఎన్జీవో సంఘం మద్దతు వారికి ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed