జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. బండి సంజయ్ సభకు అనుమతి రద్దు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-06 07:35:06  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. బండి సంజయ్ సభకు అనుమతి రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతం మొత్తం రాజకీయ నేతల సభలతో దద్దరిల్లుతుంది. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. అన్ని పార్టీలలోని కీలక నేతలు, స్టార్ క్యాంపైనర్స్ రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) బోరబండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకొని ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే ఏమైందో ఏమో గాని సభకు కొద్ది గంటల ముందు.. బండి సంజయ్ సభకు అనుమతి రద్దు (Cancellation of permission) చేసినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు పోలీసులు, ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే తాము ఎట్టి పరిస్థితుల్లో బోరబండలో సభను జరిపి తీరుతామని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలంతా.. సమయానికి బోరబండకు పెద్దఎత్తున చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం (Jubilee Hills election campaign)లో రాజకీయ వేడి నెలకొంది. మరీ సాయంత్రం బండి సంజయ్ సభ నిర్వహిస్తారా.. పోలీసులు వారిని అడ్డుకుంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story