బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు అభ్యర్ధి ఆయనే?

by Disha Web Desk 5 |
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు అభ్యర్ధి ఆయనే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లోని కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేఖత కారణంగా గెలిచే పరిస్థితి లేదని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు లేఖ ద్వారా తెలియజేశారు. దీంతో వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధి కరువయ్యారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ తరుపున వరంగల్ నుంచి పోటీ చేసే అభ్యర్ధి ఎవరా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు తెర మీదకి వచ్చింది. వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా బాల్క సుమన్ పేరు దాదాపు ఖరారు అయ్యిందని, గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నాటి నుంచి నేటి దాక ఉద్యమ స్పూర్తితోనే ఉన్నారని, పదవుల కోసం ఆరూరిలా.. కడియం కుటుంబంలా గోడలు దూకలేదని పోస్టులు పెడుతున్నారు. ముందుగా పలువురి పేర్లు వినిపించినా, వలస నేతలకు సీట్లు కేటాయిస్తే.. ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదని, బాల్క సుమన్ అయితే పార్టీతోనే ఉంటాడని, అంతేగాక ఉద్యమ నేతకు టికెట్ ఇచ్చారనే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.


Next Story

Most Viewed