- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో కుండపోత వర్షం.. ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక సూచన
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా తెలంగాణ (Telangana)లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా తెలంగాణ (Telangana)లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్ దిల్‌సుఖ్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో ప్రధాన రహదారులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే నగర పరిధిలోని పలు ఐటీ కంపెనీలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) కీలక సూచన చేశారు. రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉద్యోగులందరికీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (Work From Home) ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నగర ప్రజలు ఎవరైనా అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు.






