- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పలువురు ఐఏఎస్ ల బదిలీ.. టీజీపీఎస్సీ కార్యదర్శిగా సిరిసిల్ల కలెక్టర్
తెలంగాణలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో పాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్ గా జయేశ్ రంజన్ ను నియమించిన ప్రభుత్వం.. ఆయనే పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ గా కూడా కొనసాగుతారని తెలిపింది. సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్న హరితను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టరుగా గరిమా అగర్వాల్ కొనసాగుతారని తెలిపింది. అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నర్సింహారెడ్డిని నియమించింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన 12 జోన్లకు ఐఏఎస్ లను జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ సహదేవ్ రావు, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్. శ్రీనివాస్ రెడ్డి, గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి.ముకుంద్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా ఎన్. రవికిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్ గా కె. చంద్రకళ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధిక గుప్తా నియమితులయ్యారు.






