నా పోలీస్ సర్వీస్‌లోనే ఇది ఊహంచలేదు..! : R. S. Praveen Kumar

by Sathputhe Rajesh |   (  Updated:2023-09-30 07:05:11  IST  )

హోంగార్డు రవీందర్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన తెలిపిన అతని సహచరులపై పోలీసు ఉన్నతాధికారులు క్రమ శిక్షణా చర్యలు మొదలు పెట్టిందని తెలుస్తొంది.

RS Praveen Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో: హోంగార్డు రవీందర్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన తెలిపిన అతని సహచరులపై పోలీసు ఉన్నతాధికారులు క్రమ శిక్షణా చర్యలు మొదలు పెట్టిందని తెలుస్తొంది. ఈ క్రమంలోనే నిరసన ప్రదర్శనలు జరిపిన వారిలో 15 మంది హోంగార్డులకు సీఆర్పీసీ 41 ఏ ప్రకారం నోటీసులు జారీ చెసినట్లు ఇవాళ ‘దిశ’ పేపర్‌లో వచ్చిన ప్రత్యేక కథనంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన 26 ఏళ్ళ పోలీసు జీవితంలో హోంగార్డు సోదరులకు ఇన్ని కష్టాలొస్తయని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ‘రాబోయే బహుజన రాజ్యంలో మిమ్ములను, మీ కుటుంబాలను కంటికి రెప్పల కాపాడుకుంటాం మిత్రులారా ఒక్క అవకాశం ఇవ్వండి’ అంటూ పేర్కొన్నారు.

Next Story