వదినపై చేయి చేసుకున్న మరిది.. అడిగినందుకు అన్నను ఏమి చేశాడంటే..!

by Disha Web |
వదినపై చేయి చేసుకున్న మరిది.. అడిగినందుకు అన్నను ఏమి చేశాడంటే..!
X

దిశ, చార్మినార్ : వదినపై చెయ్యి చేసుకున్న తమ్ముడిని ఎందుకు కొట్టావ్ ​అని నిలదీసిన సొంత అన్నను బండరాయిని మోపి కిరాతకంగా హత్య చేసిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​పరిధిలో తీవ్ర కలకలం రేపింది. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌కు చెందిన గుమ్మడి చంద్రశేఖర్, ఆంజనేయులు, సురేష్​కుమార్‌లు అన్నాదమ్ములు. గత కొంత కాలం క్రిందటనే గుమ్మడి చంద్రశేఖర్​బడంగ్​పేట్‌లో ఇళ్లు కట్టుకుని, భార్యపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు.

ఆంజనేయులుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడితో అక్కడే నివసిస్తున్నారు. సురేష్​కుమార్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇప్పటి వరకు పెండ్లి కాలేదు. ఇద్దరు సోదరులు పక్క పక్కనే నివసిస్తున్నారు. అయితే ఆంజనేయులు భార్య బుధవారం కట్టెల పొయ్యి మీద నీళ్లు వేడిచేస్తుంది. కాసేపటికే అక్కడికి వచ్చిన మరిది సురేష్​ పొగతో నా కళ్లు మండుతున్నాయని దుర్భాష లాడడమే కాకుండా వదినపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆంజనేయులు దంపతులు బుధవారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలిచినప్పటికి సురేష్​ వెళ్లలేదు. మరునాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో తమ్ముడు సురేష్​ దగ్గరికి వెళ్లి నా భార్యను ఎందుకు కొట్టావని నిలదీశాడు.

దీంతో వారిరువురి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో తమ్ముడు సురేష్​ అన్నను త్రోయడంతో కిందపడిపోయాడు. పక్కనే ఉన్న బండరాయితో అన్న తలపై కొట్టాడు. తీవ్ర గాయాలైన అన్న అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫలక్​నుమా ఏసీపీ జహంగీర్​, చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

కుమారుడి పుట్టిన రోజే తండ్రి దారుణ హత్య

అంజనేయులు కుమారుడుది గురువారం జన్మదినం సందర్భంగా కొత్త బట్టలు కుట్టిచ్చారు. సాయంత్రం కుమారుడికి పుట్టిన రోజు జరుపుకుందామని ఒక రోజు ముందే ఆంజనేయులు భార్యతో చెప్పాడు. అంతలోనే మరిదితో గొడవ జరగడం.. మరిది వదినపై చెయ్యి చేసుకోవడం.. వారిరువురు చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్యపై ఎందుకు చెయ్యి చేసుకున్నావ్? అని అడిగిన పాపానికి మతిస్థిమితం లేని తమ్ముడు సొంత అన్నపై కుమారుడి పుట్టిన రోజే బండరాయితో మోది హత్య చేయడం పలువురిని కంటతడి పెట్టించింది.

Next Story

Most Viewed