తెలంగాణ విద్యార్థి ఓయూ జేఏసీ నాయకుల అరెస్ట్​

by Disha Web Desk 15 |
తెలంగాణ విద్యార్థి ఓయూ జేఏసీ నాయకుల అరెస్ట్​
X

దిశ,కార్వాన్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నష్టపోయిన నిరుద్యోగులకు మద్దతుగా శనివారం ఓయూ జేఏసీ చైర్మన్ మిడతన పల్లి విజయ్ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. కాగా వారిని పోలీసులు అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మద్దతుగా శాంతియుత నిరసన చేపడుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం సరికాదని,

బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని, పేపర్ లీకేజీ ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బండి నరేష్, వెంకట్ యాదవ్, సురేష్ ,అనిల్, సురేందర్, మహేష్, మోహన్ ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed