- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ధీరుడు సురవరం ప్రతాప రెడ్డి : మంత్రి శ్రీధర్ బాబు
నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా తన కలంతో ఎదురొడ్డి నిలిచిన ధీరుడు తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు.

దిశ, హిమాయత్ నగర్ : నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా తన కలంతో ఎదురొడ్డి నిలిచిన ధీరుడు తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. తెలంగాణ భాషా, యాసా, గుర్తింపు కోసం ప్రతాప రెడ్డి చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతాప రెడ్డి కేవలం సాహితీవేత్త మాత్రమే కాదని, స్వాతంత్ర పోరాట యోధులని ప్రశంసించారు. సురవరం ప్రతాప రెడ్డి 129వ జయంతిని పురస్కరించుకుని ‘సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పుర్కసారం 2025’ ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోగల సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియంలో జరిగింది.
శాంతా వసంతా ట్రస్ట్ సౌజన్యంతో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్వర్యంలో సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఎల్లూరి శివా రెడ్డి అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, విశిష్ట అతిథులుగా శాంతా వసంతా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత, పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ కు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణ కోసం ఏనలేని కృషి చేసి సురవరం ప్రతాప రెడ్డి భావి తరాలకు గుర్తు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం ద్వారా ఆమహానీయుడిని సముచితంగా గౌరవించిందన్నారు. తెలంగాణ భాషా, యాసకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రతాప రెడ్డి ప్రముఖ రచనలను పుస్తక రూపంలో తీసుకురానున్నామని, ఇందుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని సాహితీవేత్తలను మంత్రి కోరారు.
కె.ఐ.వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాప రెడ్డి నిజమైన హీరోని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి, సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ కార్యదర్శి సురవరం పుష్పలత, ట్రస్టు సభ్యులు సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, సురవరం రఘువర్ధన్ రెడ్డి, సురవరం విజయభాస్కర్ రెడ్డి, సురవరం రంగారెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్, పలువురు కవులు, సురవరం ప్రతాప రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






