ఘటుగా ఆర్ఎస్పీ రియాక్షన్... మీకు అప్పుడే తడుస్తున్నట్టుందిగా అంటూ...

by Disha Web |
ఘటుగా ఆర్ఎస్పీ రియాక్షన్... మీకు అప్పుడే తడుస్తున్నట్టుందిగా అంటూ...
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి తాను త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారం అని ఖండించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ప్రవీణ్ కుమార్ అలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసి ప్రజలను తికమక పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజలను మత్తులో ముంచుతూ దశాబ్దాలుగా దోచుకుంటున్నారని, బీఎస్పీ మొదలు పెట్టిన ఆసలు పోరాటం ఇంకా మొదలు కాకముందే అప్పుడే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుందని విమర్శించారు. ప్రజల్లో బీఎస్పీకి ఆదరణ పెరుగుతున్నదనే కారణంతోనే తాను పార్టీ మారుతున్నట్లుగా తప్పుడు ప్రచారం సృష్టిస్తూ చిల్లర వేషాలు వేస్తున్నారు, అసలు ఆట మొదలుకాకుండానే మీ అందరికీ తడుస్తున్నది అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆర్ఎస్పీ ఎప్పటికీ బీఎస్పీతోనే ఉంటాడని, మునుగోడులో సత్తాచాటుతామని అన్నారు.

Next Story

Most Viewed