Hyd: ఒక్క రోజే అన్ని నామినేషన్లా..!

by Disha Web Desk 16 |
Hyd: ఒక్క రోజే అన్ని నామినేషన్లా..!
X

దిశ, సిటీ బ్యూరో: శాస‌న స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి హైద‌రాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీల నామినేషన్ల పర్వంలోని నాలుగో రోజైన మంగళవారం 33 మంది అభ్యర్థులు, 37 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల విభాగం అధికారులు తెలిపారు. మంగళవారం సమర్పించిన నామినేషన్లతో కలిపి అభ్యర్థుల సంఖ్య 58కి, నామినేషన్ల సెట్ల సంఖ్యలో 64కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

తాజాగా స్వీకరించిన నామినేషన్లు

ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా స్నేహారెడ్డి రాంరెడ్డి నామినేషన్ సమర్పించగా, ఇండిపెండెంట్‌గా మహ్మద్ ఐజాజ్, మలక్‌పేట నియోజకవర్గంలో ఆలిండియా ముస్లిం ఇంకిలబ్ మిల్లత్ పార్టీ అభ్యర్థిగా ఖాజా మోహియుద్దిన్, సోషలిస్టు పార్టీ (ఇండియా) అభ్యర్థిగా హంబి హనుమంతరావు, అంబర్‌పేట నుంచి ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా నల్ల ఉదయ్ కుమార్ బీఎస్పీ అభ్యర్థిగా అన్వర్ ఖాన్ నామినేషన్లు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమైకాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ అభ్యర్థిగా జీ శ్రీకాంత్, పాటా పార్టీ అభ్యర్థిగా మాచ్చర్ల వెంకట్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బోనాసీ భీమయ్య మాదిగ మ హారాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా స య్యద్ సల్లావుద్దీన్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లి ప్రసూనాంబ నామినేషన్ సమర్పించారు.

సనత్‌నగర్ నియోజకవర్గం తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిగా సరారాపు శ్రీశైలం, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కార్తీక్ మేడీ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెక్కల కాంచన, నాంపల్లి నియోజకవర్గం స్వంతంత్ర అభ్యర్థులుగా జక్కు ల విజయలక్ష్మి, శనహాజుల్లా, సయ్యద్ సిఖింధర్ ఆలీ, అర్షద్ అహ్మద్, దేశ్ జనహిత్ పార్టీ అభ్యర్థిగా మహ్మద్ నౌశాద్ ఆలం నామినేషన్లు సమర్పించారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి జనతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖాజా మన్సూర్, ఆబాద్ పార్టీ నుంచి తాహెర్ కమల్ కుం ద్ మిరీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆవుల వినోద్ కుమార్, ఇండిపెండెంట్‌గా నర్సింగ్ సింగ్, భారత చైతన్య యువ జన పార్టీ అభ్యర్థిగా మేకల వివేక్ యాదవ్ నామినేషన్లు సమర్పించినట్లు వెల్లడించారు.

చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆలిండియా మజ్లీస్ ఈ ఇంకిలాధ్ ఈ మిల్లత్ పార్టీ అభ్యర్థిగా కౌసర్ మిర్జా నామినేషన్ సమర్పించినట్లు అధికారులు వెల్లడించా రు. యాకుత్‌పురా మజ్లిస్ అభ్యర్థిగా జాఫర్ హుస్సేన్ నామినేషన్ సమర్పించగా, ఇండిపెండెంట్లుగా సరిత్ అగల్ దివిత్కా ర్, మహ్మద్ అక్రమ్ అలీ ఖాన్ నామినేషన్లు సమర్పించారు.

సికింద్రాబాద్ నుంచి ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా మద్దెల ఆల్ ఫ్రెడ్ అరుణ్ కుమార్, ఇండియన్ బలీవర్స్ పార్టీ అభ్యర్థిగా పీఎన్. అరుణ్ కుమార్, ఇండిపెండెంట్‌గా ముదుగుల సునీత నామినేషన్లు సమర్పించగా, కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా జీవీ వెన్నెల నామినేషన్ దాఖలు చేయగా, ఇదే పార్టీ అభ్యర్థిగా నేతి రాగమంజుల కూడా నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్‌ గజ్వేల్ భారత్ కార్తీక్ నామినేషన్లు సమర్పించిన ట్లు ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. ఖైరతాబాద్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, బహద్దూర్‌పురా నియోజకవర్గాల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని కూడా వెల్లడించారు.


Next Story

Most Viewed