- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లకు ఎంత చేసినా వేస్టే: సీఎం, డిప్యూటీ సీఎంకు రాజాసింగ్ కీలక సూచన
మైనారిటీలకు ఎంత చేసినా వేస్టేనని కూటమికి ఓట్లు వేయరని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు..

దిశ, వెబ్ డెస్క్: మైనారిటీ(Mynority)ల ఓట్ల కోసం ఆశలు పెట్టుకోవద్దని, వారి కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని రాష్ట్ర సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan)కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal Mla Rajasingh) సూచించారు. బీజేపీతో పొత్తులో ఉన్నందున ముస్లింల ఓట్లు కూటమికి దక్కవని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ముస్లింలు బీజేపీని తమ ప్రధాన శత్రువుగా చూస్తున్నారని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు వంటి నిర్ణయాల కారణంగా బీజేపీకి ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమికి ముస్లింల ఓట్లు రావడం అసాధ్యమని రాజాసింగ్ స్పష్టం చేశారు.
అందువల్ల హిందువుల సంక్షేమం కోసం సమయాన్ని శక్తిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ వినియోగించాలని సూచించారు. ఏపీలో దేవాలయాలను పరిరక్షించాలని, మతమార్పిడులను అరికట్టాలని చెప్పారు. హిందూ ధర్మం కోసం పనిచేస్తే, హిందువులే కూటమికి మళ్లీ అధికారాన్నిస్తారని తెలిపారు. హిందువుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అప్పుడే రాజకీయ లబ్ధి చేకూరుతుందని రాజా సింగ్ హితవు పలికారు.






