- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అపురూప గ్రంథం "అంతర్దర్శనం" : ఎమ్మెల్యే రసమయి
by S Gopi |

X
దిశ, అంబర్ పేట్: ప్రముఖ రచయిత డాక్టర్ పూసపాటి శంకర్ రావు రచించిన "అంతర్దర్శనం" అపురూపమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. అంతర్దర్శనం గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తో కలిసి సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథం, వేదాలు, ఉపనిషత్తులు, శిల్పతత్వాల అపూర్వసారం, భారతీయ అంతర్ నేత్రానికి గ్రంథం సంకేతంగా నిలుస్తుందన్నారు. విద్యార్ధులకు, పండితులకు, పరిశోధకులకు ఒక మంచి రిఫరెన్స్ గ్రంథంగా నిలిచిపోతుందని కొనియాడారు. అనంతరం తొలి కృతిని జూలూరు గౌరీ శంకర్ కు అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, సుప్రసిద్ద విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్ పాల్గొన్నారు.
Next Story