స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన జేఎన్ టీయూ నిపుణులు

by Disha Web Desk 15 |
స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన జేఎన్ టీయూ నిపుణులు
X

దిశ,బేగంపేట : అగ్ని ప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను శనివారం మధ్యాహ్నం జేఎన్టీయూ హెచ్వోడీ డీఎన్ కుమార్, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి పరిశీలించారు. కాంప్లెక్స్ లోని నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో కాలిపోయిన ప్రాంతాల్లో ఈ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎన్ కుమార్ మాట్లాడుతూ ఐదవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ ప్రమాద తీవ్రతతో నాలుగు, ఆరు అంతస్తులు కూడా దెబ్బతిన్నాయని అన్నారు. బిల్డింగ్ ని కాలమ్స్, బీమ్స్, స్లాబ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నివేదిక ఇస్తామని చెప్పారు. అనంతరం భవనాన్ని కూల్చివేయాలా లేక మరమ్మతులు చేయాలా అనే విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశంఉందన్నారు.

పోలీసుల అదుపులో ముగ్గురు ?

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం జరిగిన ఐదవ అంతస్తులోని కేడియా ఇన్ఫోటెక్, క్యూ నైట్ కు చెందిన ముగ్గురిని మహంకాళి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్యూనెట్ ఇండియాలో అనుబంధంగా కొనసాగుతున్న విహాన్ అనే సంస్థకు చెందిన భాను, శివలతో పాటు కేడియా ఇన్ఫోటెక్ కు చెందిన యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అలాగే స్వప్నలోక్- సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. గత ఐదారేళ్ల నుంచి మెయింటెనెన్స్ చూస్తున్నా ఇప్పటి వరకు ఫైర్ సేఫ్టీ తర్వాత అత్యవసర ద్వారాలు మూసివేసినా పట్టించుకోకుండా ఉండటం, నిర్వహణ పూర్తిగా వదలి వేయడంతో ప్రమాదం జరగడానికి వీరు కూడా ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed