జాదవ్ బతికి ఉంటే ఆయనపై కూడా కేసు పెట్టేవారు : ప్రొ. హరగోపాల్

by Disha Web Desk 15 |
జాదవ్ బతికి ఉంటే ఆయనపై కూడా కేసు పెట్టేవారు  : ప్రొ. హరగోపాల్
X

దిశ, ఖైరతాబాద్ : జాదవ్ బతికి ఉంటే నేడు ఆయనపై కూడా కేసులు పెట్టేవారని ప్రొ. హరగోపాల్ అన్నారు. జాదవ్ బతికి ఉంటే ఉపా చట్టం పై మాట్లాడేవారని అన్నారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొ.కేశవరావ్ జాదవ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొ.హరగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొ.కోదండరాం , గద్దర్ , విమలక్క , సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పలువురు ప్రజా సంఘాల నేతలు హాజరై ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ జాదవ్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గా ప్రమోషన్ తీసుకోమంటే తీసుకోలేదన్నారు.

ఇందిరా గాంధీ మీద జాదవ్ పోటీ చేసినప్పుడు నాకు ఓటు వేయండని అని జాదవ్ ఎద్దరినీ అడగలేదని, జైపాల్ రెడ్డి ఒక వేళ కాంప్రమైజ్ అయితే ఇందిరాగాంధీ ఎంపీ గా నామినేట్ అవుతుందని తాను పోటీ చేశానని చెప్పాడని పేర్కొన్నారు. రాష్ట్రం లో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నా కేశవ్ రావు జాదవ్ పేరు ఎక్కడా కనపడడం లేదని అన్నారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీ లో తనకు జాదవ్ ఇంగ్లిష్ టీచర్ అని అన్నారు. ఆత్మ లేని నాయకుడు ఇప్పుడు పాలన చేస్తున్నాడని, ఒక రోబో రాష్ట్రాన్ని పాలిస్తుందని ఎద్దేవా చేశారు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని కోరారు. ఉద్యమం కోసం కొండ లక్ష్మన్ బాపూజీ ఇంట్లో కి వచ్చిన వాళ్లు ఆయన చనిపోతే సంతాప సభ పెట్టలేదని అన్నారు. ప్రస్తుతం దొర ఫాసిజంకు, మనకు మధ్య ఉద్యమం జరుగుతుందన్నారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ జాదవ్ తో తనకు పరిచయం ఉందని, ధిక్కార స్వరంనకు ప్రతి రూపం జాదవ్ అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ జాదవ్ ఉండేవారని గుర్తు చేశారు. ఆస్తులు అమ్ముకుని జాదవ్ ఉద్యమం చేశారని కొనియాడారు. ఎక్కడో మావోయిస్టులు వదిలిన బ్యాగ్ లలో ప్రొ.హరగోపాల్, విమలక్క ఇలా 152 మంది పేర్లు ఉన్నాయని, అందుకే వాళ్లపై ఉపా కేసులు పెట్టడం దారుణమన్నారు. అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క మాట్లాడుతూ మిస్టర్ తెలంగాణ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అని కొనియాడారు. అప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేశామని, రాష్ట్రం లో భావ ప్రకటన స్వేచ్చ లేదన్నారు. ఏది మాట్లాడినా ఉపా కేసులు పెడుతున్నారని, చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే ఇలాంటి కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కరువు వచ్చినప్పుడు అంబలి కేంద్రాలు పెట్టారని, ఆకలి గురించి తెలిసిన వ్యక్తి జాదవ్​ అన్నారు.

తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న నిజమైన ఉద్యమకారుల చరిత్ర లేకుండా ఇప్పటి ప్రభుత్వ చేస్తుందని ఆరోపించారు. తప్పును ప్రశ్నిస్తున్న మేధావుల మీద , ప్రొఫెసర్ ల మీద ప్రభుత్వం ఉపా కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ జాదవ్ నిబద్దత కు మారుపేరు అని అన్నారు. తెలంగాణ ఉద్యమం ను మొదట నుండి కేశవ రావు జాదవ్, కొండ లక్ష్మన్ బాపూజీ నడిపించారని పేర్కొన్నారు. పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీల వలన రాలేదని, విద్యార్థులు,కార్మికులు, సామాన్య జనాలు పోరాటం చేయడం వలన వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూసివేస్తుంటే కార్మికులు తిరగపడ్డారని పేర్కొన్నారు. జనాల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ని నింపింది కేశవ్ రావు జాదవ్ అని కొనియాడారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ను తొలగించి జాదవ్ విగ్రహం పెట్టాలని, కేబీఅర్ పార్కు కు కేశవ్ రావు జాదవ్ పేరు పెట్టాలని, హైదారాబాద్ లో జాదవ్ పేరిట ఆడిటోరియం నిర్మించాలని, అన్ని యూనివర్సిటీలలో జాదవ్ విగ్రహం పెట్టాలి అని తీర్మానించారు.

Next Story