శ్రీ రామ శోభ యాత్రకు సర్వం సిద్ధం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్

by Disha Web Desk 12 |
శ్రీ రామ శోభ యాత్రకు సర్వం సిద్ధం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాక్
X

దిశ, కార్వాన్: హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు వైభవంగా జరిగేలా ఉత్సవ సమితి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. సీతారాం బాగ్ ద్రౌపది గార్డెన్ వద్ద శోభాయాత్ర ప్రారంభమై బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, దూల్పేట్, జుమ్మేరాత్ బజార్, చుడి బజార్, ఛత్రి ,బేగంబజార్, మొహం జాహి మార్కెట్, పుత్లి బౌలీ,కోటి ఆంధ్రాబ్యాంక్ మీదుగా, హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వల్ల శోభాయాత్రలో 80 వేల నుంచి లక్షకు పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతంగా జరిగేలా వివిధ శాఖల అధికారులు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. ఇప్పటికే శోభాయాత్ర జరిగే రూట్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు ముందుగానే తగు జాగ్రత్తలు, మరమ్మతులు చేసి పోలీసులు చెక్ పోయింట్లను ఏర్పాటు చేశారు. నిర్వాహకులు సైతం శోభ యాత్ర కు స్వాగతం వేడుకలకు పాయింట్స్‌ను ఏర్పాటు చేసారు.వీలైనంత త్వరగా శోభాయాత్ర ప్రారంభించి రాత్రి 9 గంటలకల్లా ముగించేందుకు నిర్వాహకులకు పోలిసులు ముందుగానే సూచించారు.

ఓవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకూడదని, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, పార్టీ గుర్తులు ఉన్న జెండాలు ప్రదర్శన చేయకూడదని పోలీసులు హెచ్చరించారు. అంతే కాకుండా కమాండ్ కంటోల్ నుంచి, సీసీ కెమెరాలు, డ్రోన్లతో యాత్రను ప్రతి క్షణం హైదరాబాద్ పోలీసులు పర్యవేక్షిస్తామన్నారు.

ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలికి పోలీసుల అనుమతి నిరాకరణ..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్రను వైభవంగా జరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. గంగా బౌలిలోని ఆకాష్‌పురి హనుమాన్ టెంపుల్ నుండి ప్రారంభం కానున్న శోభాయాత్ర గంగాబౌళి ఎక్స్ రోడ్, గాంధీ స్టాట్యూ, బేగంబజార్, ఆంధ్రా బ్యాంక్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగనుంది. కాగా పోలీసులు మాత్రం రాజా సింగ్ శోభ యాత్రకు అనుమతులు నిరాకరించినట్లు తెలిపారు. ఇప్పటికీ ఆకాష్‌పురి హనుమాన్ టెంపుల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా రాజా సింగ్ ర్యాలీ చేసేందుకు ఇప్పటికే నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు.


Next Story

Most Viewed