డ్రగ్స్,  సైబర్ నేరాల నియంత్రణకు రెండు కొత్త విభాగాలు ఏర్పాటు

by Disha Web Desk 15 |
డ్రగ్స్,  సైబర్ నేరాల నియంత్రణకు రెండు కొత్త విభాగాలు ఏర్పాటు
X

దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్​ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వింగ్స్ ను క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ కు చీఫ్ గా సీవీ ఆనంద్, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ కు చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకం అయ్యారు. ఈ సందర్భంగా క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఎలాంటి అలజడి లేదని ఆయన పేర్కొన్నారు.

శాంతి భద్రతలు కాపాడంలో పోలీసుల కృషి అమోఘంఅన్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, దేశంలో ఎక్కడ ఏది జరిగినా తెలంగాణ పోలీస్ ల సలహా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో పోలీసుల పనితీరు వల్లే అభివృద్ది సాధ్యం అవుతుంది అని తెలిపారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగిందని వివరించారు. మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రవాణా అవుతున్నాయని, భారత దేశ చట్టాల్లో మార్పు రావాలని కోరారు. కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాలను పూర్తిగా నియంత్రణ చేయడానికి సమర్థవంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. గోవా కేంద్రంగా కరుడుగట్టిన నేరస్థులను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హెచ్ న్యూ ద్వారా అరెస్ట్ చేశామని చెప్పారు.

ఆఫ్రికన్ దేశానికి చెందిన కీలకమైన 12 మంది డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో పోలీస్ శాఖకు ధైర్యవంతులు, విజన్తో పని చేసే పోలీస్ సిబ్బంది అవసరమని వివరించారు. నేరగాళ్లు డార్క్ నైట్ ద్వారా డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారన్నారు. నార్కోటిక్ విభాగానికి 300 ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. నార్కోటిక్ బ్యూరోలో డైరెక్టర్ బృందం కార్యాలయం నుంచి నాలుగు ప్రధాన పోలీస్ కమిషనేట్లు పనిచేస్తాయని తెలిపారు.

ఈ కేసులను విచారించడానికి నాలుగు కోర్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూడొచ్చన్నారు. దేశాన్ని కుదిపోసిన 67 కోట్ల మంది డేటా చోరీ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు. అదే సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉంటే అంతరాష్ట్ర దొంగలను వేగంగా పట్టుకోవచ్చని, వారి సమాచారాన్ని ఆ రాష్ట్రాలకు వేగంగా చేరవేయవచ్చని వివరించారు. అదే కాకుండా ఇంకా సైబర్ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.


Next Story

Most Viewed