తెలుగు యూనివర్సిటీలో మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

by Disha Web Desk 13 |
తెలుగు యూనివర్సిటీలో మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలుగు విశ్వ విద్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 26 , 27,28 తేదీలలో యూనివర్శిటీలోని కళామందిరంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయంలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులతో పాటు గత 37 సంవత్సరాలుగా ఆయా శాఖల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులకు పలు అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

తెలుగు శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, కవితా రచన, సంగీత శాఖ ఆధ్వర్యంలో గాత్ర సంగీతం, వాద్య సంగీతం, లలిత గీతాలు, సినిమా పాటలు,రంగస్థల కళల శాఖ ఏకపాత్రాభినయం, మిమిక్రీ, పద్య పఠనం, షార్ట్మ ఫిల్మ్ మేకింగ్, మైమ్ పోటీలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా నృత్యశాఖ కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, జానపద కళల శాఖ జానపద వాద్యం (డప్పు), ఇంద్రజాలం, జానపద గేయాలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, జానపద వస్తు ప్రదర్శన, యోగశాఖ యోగాసనాలు, జర్నలిజం శాఖ ఎన్టీఆర్ చలన చిత్రాలు- సామాజిక స్పృహ పై చర్చాగోష్టి, జ్యోతిష్య శాఖ జ్యోతిష్యం- శాస్త్రీయాంశాలపై చర్చాగోష్టి, భాషా శాస్త్ర శాఖ తెలుగు ఔన్నత్యం - చర్చాగోష్టి వంటి అంశాలపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. పోటీలలో పాల్గొనాలనుకునే పూర్వ, ప్రస్తుత విద్యార్థులు తాము పాల్గొనాలనుకునే అంశం ఏ శాఖ పరిధిలో ఉందో తెలుసుకుని తమ పేర్లను శాఖాధిపతిని కలిసి ఏప్రిల్ 15వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ఆచార్య భట్టు రమేష్ కోరారు.



Next Story

Most Viewed