- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేగంపేట్‌లో దారుణం.. పీఎస్ ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నగరంలోని బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్ అవరణలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నగరంలోని బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్ అవరణలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంలో భాగంగా పోలీసులు ఇద్దరిని సోమవారం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలోనే తనపై భార్య అకారణంగా ఫిర్యాదు చేసిందని భర్త అఖిల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతకు ముందే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను ఒపెన్ చేసి ఒంటిపై పోసుకుని స్టేషన్ ఆవరణలో నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అఖిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన అక్కడున్న సిబ్బంది అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Next Story






