- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 25 వేల పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి
దిశ, ముషీరాబాద్ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో డీఎస్సీని ప్రకటించకుండా పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని పలువురు నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఐదు వేల పోస్టులను ప్రకటించి ప్రభుత్వం బాధ్యతనుంచి తప్పించుకుంటుందని విమర్శించారు. డీఎస్సీ పరీక్షలను నాలుగు నెలలు వాయిదా వేయాలని, మొత్తం 25 వేల పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, టీజేఎస్ అధ్యక్షులు ఆచార్య కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొని మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకే డీఎస్సీ నోటిఫికేషన్ తూతూ మంత్రంగా జారీ చేసిందన్నారు. గత మార్చి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ విద్యాశాఖలో 13086 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ విషయం మరిచారని విమర్శించారు. ఆచార్య కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ లేక పోవడంతో విద్యార్థులకు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పాఠశాలల్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు పరిజ్ఞానం సంపాదించలేక వెనుకబడిపోతున్నారన్నారు. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు అవుతుందనే కోణంలో
చూడకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, బడ్జెట్ భవిష్యత్తరాల అభివృదధికి ఖర్చుచేస్తున్నామని ప్రభుత్వం భావించాలన్నారు. ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా విద్యను నిర్వీర్యం చేసే కుట్రను చేస్తుందని ఆరోపించారు. డీఎస్సీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేసి అభ్యర్థుల ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంటకేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు రాంమోహన్, శివకృష్ణ, నందగోపాల్, ప్రదీప్ తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.