HYD : మహిళా కమిషన్ దగ్గర ఉద్రిక్తత

by Rajesh |
HYD : మహిళా కమిషన్ దగ్గర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ వస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని గులాబీ శ్రేణులు పట్టుబట్టాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను పంపించాలని పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులు సర్దిచెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

Next Story

Most Viewed